Header Banner

కరోనా కేసులు పెరుగుతున్న వేళ దేశంలో కొవిడ్‌ కొత్త వేరియంట్ల‌ కలకలం.. వెల్లడించిన ఇన్సాకాగ్!

  Sat May 24, 2025 15:11        Politics

దేశంలో మ‌ళ్లీ మ‌హమ్మారి క‌రోనా వైర‌స్‌ పంజా విసురుతోంది. దేశ‌వ్యాప్తంగా మరోసారి కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ప్ర‌స్తుతం 270కి పైగా యాక్టివ్‌ కేసులు ఉన్న‌ట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. తగినన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు, వ్యాక్సిన్లు, బెడ్లు, టెస్ట్‌ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించాయి. దేశంలోనే కేరళ రాష్ట్రంలో క‌రోనా కేసుల పెరుగుదల అత్యధికంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.

 

ఇది కూడా చదవండి: కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మాస్క్‌లను తప్పనిసరి చేశారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే ముఖానికి మాస్క్‌ ధరించాలన్నారు. కర్ణాటకలో కూడా క‌రోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో 35 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ తేలిన వారిలో తొమ్మిది నెలల శిశువు కూడా ఉంది. మహారాష్ట్ర ముంబ‌యిలోనూ 95 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. మ‌రోవైపు దేశ రాజ‌ధాని ఢిల్లీలో మూడేళ్ల తర్వాత తొలిసారి ఈ నెలలో 23 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాజా వేరియెంట్‌ సాధారణ ఇన్ఫ్లు ఎంజా లాంటిది మాత్రమే అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్‌ సింగ్ తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే స‌రిపోతుంద‌ని అన్నారు. అటు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ నగరాలైన ఘజియాబాద్‌, నోయిడాలోనూ కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్‌లో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోదు కాగా... నోయిడాలో ఇవాళ తొలి కరోనా కేసు వెలుగు చూసింది. 55 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కొత్త వేరియంట్‌లు వెలుగుచూస్తుండటం కలకలం సృష్టిస్తోంది. భారత్‌లో కోవిడ్-19 కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7 లను గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) శనివారం వెల్లడించింది. ఎన్‌బీ.1.8.1 వేరియంట్ కేసు ఏప్రిల్‌లో వెలుగుచూడగా.. ఎల్‌ఎఫ్‌.7 కు సంబంధించి 4 కేసులను ఈ నెలలో గుర్తించినట్లు కన్సార్టియం వెల్ల‌డించింది. ఆ కేసులు తమిళనాడు, గుజరాత్‌లో నమోదయ్యాయని తెలిపింది.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #CoronaVirus #XECVariant #Germany #Europe